రాష్ట్రవ్యాప్తంగా 6700 ధాన్యం కొనుగోలు కేంద్రాలు.. గంగులకమలాకర్

రీంనగర్ జిల్లా మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను  ప్రారంభించారు. 

First Published Apr 18, 2020, 3:19 PM IST | Last Updated Apr 18, 2020, 3:19 PM IST

రీంనగర్ జిల్లా మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను  ప్రారంభించారు. రైతులెవ్వరూ సామూహికంగా రాకూడదని.. ప్రతీ గ్రామంలో దాదాపుగా ఎప్పుడూ లేనివిధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 70 నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించిందన్నారు... గతంలో నాల్గైదు గ్రామాలకు కలిపి ఓ కొనుగోలు కేంద్రముంటే.. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 6700 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. ఇప్పటికే నాలుగు వేల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్టు మంత్రి గంగుల వెల్లడించారు.