Asianet News TeluguAsianet News Telugu

నకిలీ ఐఎఎస్ శ్రీనివాస్ ను కలిసింది నిజమే...: సీబీఐ విచారణపై గంగుల కామెంట్స్

కరీంనగర్ : నకిలీ ఐపిఎస్ శ్రీనివాస్ కేసులో సిబిఐ విచారణ ఎదుర్కోవడంపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. 

First Published Dec 4, 2022, 3:09 PM IST | Last Updated Dec 4, 2022, 3:09 PM IST

కరీంనగర్ : నకిలీ ఐపిఎస్ శ్రీనివాస్ కేసులో సిబిఐ విచారణ ఎదుర్కోవడంపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. ఐపిఎస్ అధికారిగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన శ్రీనివాస్ పేరు చాలాసార్లు విన్నానని... అతడు మున్నూరు కాపు అని తెలిసి ఓ సారి కలిసానని అన్నారు. అదే రోజు ఓ ఫోటో దిగానని... ఈ ఫోటోను సిబిఐ విచారణకు కారణమయ్యిందని అన్నారు. తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి ఐపిఎస్ అయ్యాడని ఎంతో గర్వంగా ఫీలయ్యానని... కానీ ఇలా నకిలీ ఐఏఎస్ అని తెలీదన్నారు. శ్రీనివాస్ తనకు ఎలాంటి పనులు అడగలేదు... అతడికి తాను కూడా ఏ పనులు అడగలేదు... తనతో అతడికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి గంగుల స్పష్టం చేసారు.