Asianet News TeluguAsianet News Telugu

స్వగ్రామంలో మంత్రి ఎర్రబెల్లి సందడి... ప్రాచీన శివాలయంలో ప్రత్యేక పూజలు

వరంగల్ : తెలంగాణ పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు స్వగ్రామంలో పర్వతగిరిలో పర్యటించారు. 

First Published Dec 5, 2022, 4:00 PM IST | Last Updated Dec 5, 2022, 4:00 PM IST

వరంగల్ : తెలంగాణ పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు స్వగ్రామంలో పర్వతగిరిలో పర్యటించారు. గ్రామంలోని ప్రాచీన శివాలయ పున:నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి ప్రత్యేకపూజలు నిర్వహించారు. పర్వతాల శివాలయాన్ని వచ్చేఏడాది ఆరంభంలో అంటే జనవరి 26, 2023 లో ప్రారంభించాలని నిర్ణయించగా ఇందుకోసం జరుగుతున్న ఏర్పాట్లను కూడా మంత్రి ఎర్రబెల్లి పరిశీలించారు. చుట్టుపక్కల 200 గ్రామాల ప్రజలు ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారని... వైభవంగా జరిగే ఈ వేడుకలో తాను కూడా పాలుపంచుకుంటానని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.