జనగామలో భారీ వర్షాలు... వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి ఎర్రబెల్లి పర్యటన
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు జనావాసాలు, పంటలను ముంచెత్తుతున్నాయి.
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు జనావాసాలు, పంటలను ముంచెత్తుతున్నాయి. వరద నీరు పోటెత్తడంతో నదులు, వాగులువంకలు ఉదృతంగా ప్రవహిస్తూ జలాశయాలు, నీటిపారుదల ప్రాజెక్టులు, చెరువులు నిండిపోయి ప్రమాదకరంగా మారాయి. ఈ క్రమంలో జనగామ జిల్లాలో వర్షాలు, వరదల తాజా పరిస్థితులపై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సమీక్షించారు. జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమావేశమైన మంత్రి తాజా పరిస్థితిపై ఆరా తీసారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న సమయంలోనే కాదు ఈ వానాకాలం మొత్తం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. వర్షాలు, వరద ప్రభావం తగ్గిన తర్వాత అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాలలో మంత్రి ఎర్రబెల్లి వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సందర్శించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి అక్కడి తాజా పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. అనంతరం ఇప్పగూడెంలో హరితహరంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి మంత్రి ఎర్రబెల్లి మొక్కలు నాటారు.