ఆచార్య జయశంకర్ వర్ధంతి... పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించిన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్: నేడు ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా వరంగల్ ఏకశిల పార్క్ లోని ఆయన విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. 

First Published Jun 21, 2022, 2:35 PM IST | Last Updated Jun 21, 2022, 2:35 PM IST

వరంగల్: నేడు ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా వరంగల్ ఏకశిల పార్క్ లోని ఆయన విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. జయశంకర్ సార్ జయంతి, వర్ధంతి లను ఘనంగా నిర్వహించడం, ఆయన సేవలను స్మరించుకోవడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని మంత్రి అన్నారు.  ప్రొఫెసర్ గా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సిద్ధాంత కర్తగా ప్రజల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నతుడు కొత్తపల్లి జయశంకర్ అని కొనియాడారు. జయశంకర్ సార్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేసి ఆజన్మాంతం బ్రహ్మచారిగా గడిపారని... ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యాప్తి చేయడంలో ఆయన పాత్ర మరవలేనిదని మంత్రి ఎర్రబెల్లి గుర్తుచేసుకున్నారు.