నందమూరి కుటుంబంలో విషాదం... ఉమామహేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం ఎన్టీఆర్ కూతురు, హీరో బాలకృష్ణ సోదరి కంఠమనేని ఉమామహేశ్వరి మృతితో పుట్టెడు దు:ఖంలో వున్న కుటుంబసభ్యులను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పరామర్శించారు.

First Published Aug 2, 2022, 4:46 PM IST | Last Updated Aug 2, 2022, 5:02 PM IST

హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం ఎన్టీఆర్ కూతురు, హీరో బాలకృష్ణ సోదరి కంఠమనేని ఉమామహేశ్వరి మృతితో పుట్టెడు దు:ఖంలో వున్న కుటుంబసభ్యులను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పరామర్శించారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్న మంత్రి అక్కడే వున్న బాలకృష్ణ, మోహనకృష్ణతో ఇతర కుటుంబసభ్యులను ఓదార్చారు. ఉమామహేశ్వరి ఆత్మహత్యపై కుటుంబసభ్యులను అడిగి వివరాలు తెలుగుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ... నందమూరి కుటుంబంలో నెలకొన్న విషాదాన్ని చూసి తెలుగు ప్రజలు కూడా విషాదంలో మునిగిపోయారన్నరు. ఇటీవలే ఉమామహేశ్వరి ఇంట శుభకార్యం జరిగిందని... ఇప్పుడిలా అదే ఇంట విషాదం అలుముకోవడం బాధాకరమన్నారు. ఉమామహేశ్వరి ఆత్మకు శాంతి చేకూరాలని... తన ప్రగాఢ సంతాపం, కుటుంబసభ్యులకు సానుభూతి తెలుసుతున్నట్లు మంత్రి దయాకరరావు పేర్కొన్నారు.