గిరిజన యువకుడికి ఆపన్నహస్తం... మానవత్వాన్ని చాటుకున్న మంత్రి దయన్న
వరంగల్: రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మానవత్వాన్ని చాటుకున్నారు.
వరంగల్: రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న ఓ గిరిజన యువకుడిని చూసి చలించిపోయారు. దీంతో తన వాహనంలోనే హాస్పిటల్ కు తరలించి సరయిన సమయంలో వైద్యం అందేలా చూశారు. గాయపడిన యువకుడి వెంట తన భద్రతా సిబ్బందిని పంపడమే కాదు వైద్యం కోసం ఆర్థిక సహాయం కూడా చేశారు మంత్రి. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి నుండి రాయపర్తికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.