బస్సు కోసం రోడ్డుపై వేచి ఉన్న మంత్రి ఈటల (వీడియో)
Aug 21, 2019, 4:42 PM IST
తెలంగాణ రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బస్సు కోసం ఔటర్ రింగ్ రోడ్డుపై ఎదురు చూశారు. సాధారణ ప్రయాణీకుడి మాదిరిగా మంత్రి బస్సు కోసం ఎదురు చూశాడనుకోకండి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని కోమటికుంటలో కలెక్టర్లతో కలిసి సీఎం బుధవారం నాడు పర్యటనకు వెళ్లారు.ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లేందుకుగాను మంత్రి ఈటల సీఎం బస్సు కోసం ఎదురు చూశారు. ఔటర్ రింగ్ రోడ్డుపై మంత్రి ఈటల నిలబడితే సీఎం ఆయనను బస్సులో కోమటికుంటకు తీసుకెళ్లారు.