Asianet News TeluguAsianet News Telugu

పేదల ఇంట పెద్ద కొడుకు మ‌న కేసీఆర్ (వీడియో)

వృద్ధులకు ఆసరా కల్పించి.. వితంతువులకు భరోసానిచ్చి..వికలాంగులకు చేయూతనందించి పేదల ఇంట్లో సీయం కేసీఆర్  పెద్దకొడుకయ్యాడని  అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. శ‌నివారం నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని ప‌లు వార్డుల్లో పెంచిన పింఛన్లను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. అంత‌కుముందుకు నాయిడివాడ ఆర్యవైశ్య సంఘ భవనంలో పెంచిన పింఛన్ల అమలును హర్షిస్తూ మంత్రి అల్లోల ఆద్వ‌ర్యంలో సీయం కేసీఆర్  చిత్రపటానికి పాలాభిషేకం నిర్వ‌హించారు.
 

నిర్మ‌ల్:  వృద్ధులకు ఆసరా కల్పించి.. వితంతువులకు భరోసానిచ్చి..వికలాంగులకు చేయూతనందించి పేదల ఇంట్లో సీయం కేసీఆర్  పెద్దకొడుకయ్యాడని  అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. శ‌నివారం నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని ప‌లు వార్డుల్లో పెంచిన పింఛన్లను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. 

అంత‌కుముందుకు  నాయిడివాడ ఆర్యవైశ్య సంఘ భవనంలో పెంచిన పింఛన్ల అమలును హర్షిస్తూ మంత్రి అల్లోల ఆద్వ‌ర్యంలో సీయం కేసీఆర్  చిత్రపటానికి పాలాభిషేకం నిర్వ‌హించారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపు నేటి నుంచి అమలులోకి వ‌చ్చింద‌ని ఈ సందర్భంగా మంత్రి అన్నారు.  ఉద్యమ సమయంలో అనాథ వృద్ధుల జీవితాలను కళ్లారా చూసి చలించి పోయిన తెలంగాణ ఉధ్యమ రథ సారధి కేసీఆర్ స్వరాష్ట్రం సిద్ధిస్తే మన రాష్ట్రంలో మన పాలన మీ బతుకులను బాగు చేసేందుకు పింఛన్ డబ్బులను పెంచి మీకు పెద్ద కొడుకును అవుతానని పలు సభల్లో చెప్పినట్లుగానే ఆచరణలో అమలు పెట్టి చేసి చూపించార‌న్నారు.

 

వృద్దుల‌కు ఓ కొడుకులా, చెల్ల‌మ్మ‌ల‌కు ఓ అన్న‌లా సీయం కేసీఆర్ అండ‌గా నిల‌బ‌డ్డార‌ని తెలిపారు. పెరిగిన పింఛన్ ప్రకారం వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, బోధకాలు బాధితులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు రూ.2,016 చొప్పున, వికలాంగులకు రూ.3,016 చొప్పున అందజేస్తున్నామ‌ని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,47, 400 మంది లబ్ధిదారులు ఉండ‌గా, గ‌తంలో ఫించ‌న్ల కోసం  ప్ర‌భుత్వం  రూ.15 కోట్ల 36 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తే ఇప్పుడు పెంచిన ఫించ‌న్ల కోసం దాని కంటే రెట్టింపుగా రూ.31 కోట్లు ఖ‌ర్చు చేస్తుంద‌న్నారు. 

 

ఫించ‌న్ దారుల‌ అర్హ‌త వయ‌స్సును త‌గ్గించ‌డంతో అద‌నంగా మ‌రో 20 మందికి ల‌బ్ధిదారుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర‌నుంద‌ని చెప్పారు.  ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఫించ‌న్ల ప‌థ‌కం వృద్దులు, వికలాంగులు, ఒంట‌రి మ‌హిళ‌ల ఇదో వ‌రంగా మారింద‌న్నారు. చాలా మంది ల‌బ్ధిదారులు త‌మ అవ‌స‌రాల‌కు పోను మిగితా ఫించ‌న్ డ‌బ్బుల‌ను పొదుపు చేసుకుంటున్నార‌ని, పెరిగిన ఫించ‌న్ల‌తో వారు ఆర్థికంగా మ‌రింత నిల‌దొక్కుకునే అవ‌కాశం ల‌భించింద‌న్నారు.  

ప్ర‌త్యేక‌ రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెలంగాణలో దేశం గర్వించ దగ్గ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని, రైతుబంధు, రైతు బీమా కల్యాణ లక్ష్మి, షాదీ ముబార‌క్ వంటి ఇతర పథకాలు ప్రతి కుటుంబానికి చేరుతున్నాయ‌ని వెల్ల‌డించారు. 

ఈ కార్య‌క్ర‌మంలో జడ్పీ  చైర్ ప‌ర్స‌న్ కే. విజయలక్ష్మి, కలెక్టర్ ప్రశాంతి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

రూ.100 కోట్ల‌తో నిర్మ‌ల్ ప‌ట్ట‌ణాభివృద్ది

నిర్మ‌ల్ ప‌ట్ట‌ణాన్ని అభివృద్ది చేసేందుకు నిరంత‌రంగా కృషి చేస్తున్నామ‌ని, రూ.100 కోట్ల‌తో ప‌ట్ట‌ణాన్ని అభివృద్దికి చేసేందుకు ప్ర‌ణాళిక‌లు రూపోందించిన‌ట్లు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. రూ.40 కోట్ల అభివృద్ది ప‌నుల‌కు ఇప్ప‌టికే టెండ‌ర్లు పిలిచామ‌ని..త్వ‌రలోనే ప‌నులు ప్రారంభిస్తామ‌ని చెప్పారు.  ప‌ట్ట‌ణంలోని ప్ర‌ధాన కూడ‌ళ్ళ వ‌ద్ద రోడ్ల‌ను విస్త‌రిస్తామ‌ని, అండ‌ర్ డ్రైనేజీ నిర్మిస్తామ‌ని వెల్ల‌డించారు.