పోలీసులపై వలస కార్మికుల దాడి..!

హైదరాబాద్ లోని కంది ఐఐటీ భవన నిర్మాణ పనుల కోసం వచ్చిన 1600 మంది కార్మికులు లాక్‌డౌన్‌ కారణంగా గత నెలరోజులకు పైగా ఇక్కడే ఉండిపోయారు.

First Published Apr 29, 2020, 4:25 PM IST | Last Updated Apr 29, 2020, 4:25 PM IST

హైదరాబాద్ లోని కంది ఐఐటీ భవన నిర్మాణ పనుల కోసం వచ్చిన 1600 మంది కార్మికులు లాక్‌డౌన్‌ కారణంగా గత నెలరోజులకు పైగా ఇక్కడే ఉండిపోయారు. వీరంతా తమ సొంత గ్రామాలకు వెళ్తామని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులపై రాళ్లు, కట్టెలతో దాడికి యత్నించారు. కార్మికుల రాళ్ల దాడిలో పోలీసు వాహనం ధ్వంసమైంది. ఘటనా స్థలికి పోలీసు బలగాలు భారీగా చేరుకోవడంతో కార్మికులు వెనక్కి తగ్గారు.