ప్రభుత్వాల మాటలు కాదు.. సొంత కాళ్లనే నమ్ముకున్నారు..
వలసకూలీలను సొంత ఊర్లకు పంపిస్తామని ప్రభుత్వం అంటున్న వలసకూలీలు ఆగడం లేదు.
వలసకూలీలను సొంత ఊర్లకు పంపిస్తామని ప్రభుత్వం అంటున్న వలసకూలీలు ఆగడం లేదు. జగిత్యాల జిల్లా ధర్మపురి దగ్గర్లోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలకు అనుసంధానం గా ఉన్న రాయపట్నం గోదావరి నదిపై ఉన్న వంతెనపై నుండి చత్తిష్ గడ్ కు వలస కూలీలు
కాలినడకన వెళుతున్నారు. వలసకూలీలను పంపడానికి ప్రభుత్వం అనుమతించడంతో గోదావరి వంతెనకు ఇరువైపులా ఉన్న చెక్ పోస్టుల వద్ద ఆంక్షలు సడలించారు. దీంతో వలసకూలీలు స్వేచ్ఛగా వెడుతున్నారు.