కరీంనగర్ లో మెడికల్ కాలేజీ సంబరాలు... యువతులతో కలిసి చిందేసిన మంత్రి గంగుల

కరీంనగర్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం పలు జిల్లాలకు మెడికల్ కాలేజీలు ప్రకటించారు. ఇందులో కరీంనగర్ జిల్లా కూడా ఒకటి. ఇలా తమ జిల్లాకు మెడికల్ కాలేజీ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులు, టీఆర్ఎస్ శ్రేణులు కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాల్లో జిల్లా మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని విద్యార్థులతో కలిసి సీఎం కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు.  
 
First Published Mar 9, 2022, 11:17 AM IST | Last Updated Mar 9, 2022, 11:17 AM IST