Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ లో పట్టపగలే భారీ చోరీ.. వ్యక్తి చేతిలో నుంచి నగదు సంచి లాక్కెళ్లిన దొంగలు..

యాంకర్ : కరీంనగర్ నడిబొడ్డున నిత్యం రద్దీగా ఉండే సెంటర్లో సినీఫక్కీలో దొంగతనం జరిగింది.

First Published Sep 7, 2022, 12:19 PM IST | Last Updated Sep 7, 2022, 12:19 PM IST

యాంకర్ : కరీంనగర్ నడిబొడ్డున నిత్యం రద్దీగా ఉండే సెంటర్లో సినీఫక్కీలో దొంగతనం జరిగింది. పట్టపగలు ఒక వ్యక్తి చేతిలో నుండి  రూ.15 లక్షల నగదుతో కూడిన బ్యాగ్ ను దొంగిలించారు. నిందితుల కోసం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పర్యవేక్షణలో టాస్క్ఫోర్స్, సీసీఎస్, క్రైంటీం. రెండో ఠాణా పోలీసులతో ఎనమిది ప్రత్యేక టీంలను రంగంలోకి దించారు. కరీంనగర్ లో ఒక వ్యక్తి బ్యాంకు నుండి 15 లక్షలు విత్ డ్రా చేసి వెళ్తున్న క్రమంలో అతడిని వెంబడించిన దొంగలు వాహనంపై వచ్చి బ్యాగును అపహరించారు. సిద్దిపేట నుంచి అలుగునూర్ ద్వారా కరీంనగర్లోకిప్రవేశించిన ఈ ప్రొఫెషనల్ దొంగల ముఠా ఇదే కాకుండా 10 రోజుల నుంచి తెలంగాణలోని హైదరాబాద్, భువనగిరి, కామారెడ్డి, సిద్ధిపేట, కరీంనగర్లో వరుస చోరీలకు పాల్పడ్డారు. నిందితుల సమాచారం అందించినవారికి నగదు బహుమతి అందిస్తామని పోలీసులు ప్రకటించారు. సీసీ టీవీల్లో దొరికిన ఆనవాళ్ల ప్రకారం ఇద్దరు నిందితులఫొటోలను సోషల్ మీడియాల్లో పోస్టు చేశారు. వీరి సమాచారం తెలిసినవారు రెండో ఠాణా ఎస్సై 9440795107, 7901122528, ఎస్ఐ 7901143762 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.