Asianet News TeluguAsianet News Telugu

మీ కడుపునే పుడతా... మళ్లీ వాడికిచ్చి పెళ్లి చేయకండి..: కన్నీరు పెట్టిస్తున్న వివాహిత సూసైడ్ లెటర్


కరీంనగర్ : భర్త వేధింపులు భరించలేక పుట్టింటికి వచ్చిన వివాహిత తల్లిదండ్రులకు భారం కాలేక ఆత్మహత్య చేసుకుంది.

First Published Dec 18, 2022, 3:21 PM IST | Last Updated Dec 18, 2022, 3:21 PM IST


కరీంనగర్ : భర్త వేధింపులు భరించలేక పుట్టింటికి వచ్చిన వివాహిత తల్లిదండ్రులకు భారం కాలేక ఆత్మహత్య చేసుకుంది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం పుట్టింట్లోంచి బయటకు వెళ్లిన ఒల్లపు సోని(21) రాత్రయినా తిరిగిరాకపోవడంతో కంగారుపడిన కుటుంబసభ్యులు గ్రామమంతా వెతికారు. చివరకు ఇంటి సమీపంలోని వ్యవసాయ బావిలో ఆమె మృతదేహం కనిపించడంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. 

''అమ్మానాన్న... మీతో కలిసి సంతోషంగా జీవించాలని వుంది. మీకు దూరంగా వెళ్లి చావడం కూడా నాకు ఇష్టం లేదు. మళ్లీ జన్మంటూ వుంటే మీ అందరి మధ్య పుడతాను. కానీ మళ్లీ వాడికి ఇచ్చి పెళ్లి చేయకండి'' అంటూ వివాహత సూసైడ్ లెటర్ బావి పక్కన లభించింది. అ లెటర్ చదివేవాళ్ల చేత కన్నీరు పెట్టిస్తోంది.