సినీ ఫక్కీలో వివాహిత కిడ్నాప్... మారణాయుధాలతో బెదిరించి తల్లిదండ్రులే...
జగిత్యాల జిల్లాలో సినీ పక్కీలో ఓ యువతి కిడ్నాప్ జరిగింది. తమను ఎదిరించి ప్రేమించినవాడిని పెళ్లాడిన అమ్మాయిని అత్తవారి ఇంటినుండి కిడ్నాప్ చేసారు కుటుంబసభ్యులు.
జగిత్యాల జిల్లాలో సినీ పక్కీలో ఓ యువతి కిడ్నాప్ జరిగింది. తమను ఎదిరించి ప్రేమించినవాడిని పెళ్లాడిన అమ్మాయిని అత్తవారి ఇంటినుండి కిడ్నాప్ చేసారు కుటుంబసభ్యులు. అత్తింటివారిని, భర్తను మారణాయుధాలతో బెదిరించి యువతి బలవంతంగా తీసుకెళ్లారు. జగిత్యాల రూరల్ మండలం బలపెల్లి గ్రామానికి చెందిన యువకుడు జక్కుల మధు, రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన యువతి ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరికి పెళ్లి చేసేందుకు అమ్మాయి కుటుంబసభ్యులు అంగీకరించలేదు. అయినప్పటికి యువతి పుట్టింటివారిని కాదని ప్రేమించిన వాడినే ఆరునెలల క్రితం పెళ్ళాడింది. దీంతో యువతితో పాటు ఆమె భర్త, కుటుంబసభ్యులపై కోపాన్ని పెంచుకున్నారు. ఈ క్రమంలోనే నిన్న(ఆదివారం) రెండు కార్లలో వచ్చిన యువతి తల్లిదండ్రులు, మేనమామ, మేనత్త అత్తింటివారిని బెదిరించి యువతిని బలవంతంగా తమవెంట తీసుకెళ్లారు. దీంతో తన భార్యను కిడ్నాప్ చేసారంటూ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు.