Asianet News TeluguAsianet News Telugu

విజయవాడలో దారుణం... ప్రకాశం బ్యారేజీలో దూకి వివాహిత ఆత్మహత్య

విజయవాడ : గత శనివారం ప్రకాశం బ్యారేజీలో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ మృతదేహం రెండ్రోజుల తర్వాత కృష్ణా నది వారధివద్ద లభించింది.

First Published Dec 6, 2022, 5:03 PM IST | Last Updated Dec 6, 2022, 5:03 PM IST

విజయవాడ : గత శనివారం ప్రకాశం బ్యారేజీలో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ మృతదేహం రెండ్రోజుల తర్వాత కృష్ణా నది వారధివద్ద లభించింది. విజయవాడ అశోక్ నగర్ కు చెందిన వివాహిత ఉదయశ్రీ గత శనివారం బిడ్డను వదిలి కనిపించకుండా వెళ్లిపోయింది. దీంతో కుటుంబసభ్యులు బంధువులు, తెలిసినవారి వద్ద ఎక్కడా ఆమె ఆఛూకీ లభించకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి వెతకడం ప్రారంభించారు. అయితే కృష్ణానది వారధి వద్ద ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా వారు బయటకు తీయించి ఉదయిశ్రీగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

ఉదయశ్రీ ఆత్మహత్యకు భర్త నాగేంద్రతో విబేదాలే కారణమని కుటుంబసభ్యులు చెబుతున్నారు. కుటుంబ కలహాలతో గత నాలుగు నెలలుగా భార్యాభర్తలు వేరుగా వుంటున్నారని... ఈ క్రమంలోనే ఉదయశ్రీ ఆత్మహత్య చేసుకుటున్నట్లుగా కుటుంబసభ్యులు చెబుతున్నారు.