Asianet News TeluguAsianet News Telugu

తాగిన మైకంలో భార్యను చితకబాది.. బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

తాగిన మత్తులో భార్యను చితకబాది, పిల్లల్ని చంపి, తాను చనిపోతానని వెళ్లిన ఓ వ్యక్తి.. పోలీసుల్ని చూసి..

First Published Jul 16, 2022, 3:00 PM IST | Last Updated Jul 16, 2022, 3:00 PM IST

తాగిన మత్తులో భార్యను చితకబాది, పిల్లల్ని చంపి, తాను చనిపోతానని వెళ్లిన ఓ వ్యక్తి.. పోలీసుల్ని చూసి.. పిల్లల్ని వదిలేసి తాను బావిలో దూకి చనిపోయాడు. కరీంనగర్ జిల్లా : వీణవంక మండలం మండలం  గన్ముకల గ్రామంలో దారుణం జరిగింది. ఓ కన్న తండ్రి మద్యానికి బానిసై తన ఇద్దరు పిల్లలు చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. సకాలంలో స్పందించిన వీణవంక పోలీసులు స్పందించడంతో పిల్లల్ని వదిలేసి తాను బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు. వీణవంక మండలం గన్ముకల గ్రామం చెందిన వీణవంక కుమార్, జ్యోతిలక్ష్మిలకు శ్రీనాథ్,  శ్రీనిథ్ ఇద్దరు పిల్లలు. మద్యాన్ని బానిసైనా కుమార్ స్వామి రోజు ఇంట్లో గొడవ చేసేవాడు. శుక్రవారం రోజు కూడా మద్యం తాగి వచ్చాడు. ఇంట్లో భార్యను చితకబాదాడు. పిల్లల్ని తీసుకుపోయి నేను కూడా చస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన కుటుంబ సభ్యులు
100 డైల్ కు ఫోన్ చేశారు. పోలీసులను చూసిన కుమార్ స్వామి.. పిల్లని వదిలేసి దగ్గరున్న వ్యవసాయ బావిలో దూకాడు. వెంటనే హోంగార్డ్ ప్రకాష్ బావిలో దిగి కుమార్ ను రక్షించే ప్రయత్నం చేశాడు.