Asianet News TeluguAsianet News Telugu

డబుల్ బెడ్రూం ఇంటికోసం వ్యక్తి ఆత్మహత్య... సీఎం కేసీఆర్ ఇలాకాలో ఇదీ పరిస్థితి...


సిద్దిపేట : తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు నిరుపేదల సొంతింటికలను నెరవేర్చడం ఏమోగానీ వాటిపై ఆశలు పెంచుకుని అమాయకులు బలవుతున్నారు.

First Published Dec 6, 2022, 2:54 PM IST | Last Updated Dec 6, 2022, 2:54 PM IST


సిద్దిపేట : తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు నిరుపేదల సొంతింటికలను నెరవేర్చడం ఏమోగానీ వాటిపై ఆశలు పెంచుకుని అమాయకులు బలవుతున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్ పరిధిలోని హందిపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇల్లు రాలేదని శిలసారం రమేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సీఎం ఇలాకాలో ఈ ఆత్మహత్య జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. 

ఆత్మహత్య చేసుకున్న రమేష్ మృతదేహానికి బిజెపి ఎమ్మెల్యేలు రఘునందర్ రావు, ఈటల రాజేందర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రమేష్ ది ఆత్మహత్య కాదు టీఆర్ఎస్ ప్రభుత్వ హత్యేనని ఈటల ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆత్మహత్య చేసుకున్న రమేష్ కుటుంబానికి రూ.50 లక్ష పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఈటల డిమాండ్ చేసారు.