పాతకక్షలు... బెల్టు షాప్ వద్ద వ్యక్తి దారుణ హత్య

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలో దారుణం జరిగింది.

First Published Feb 25, 2021, 11:43 AM IST | Last Updated Feb 25, 2021, 11:43 AM IST

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలో దారుణం జరిగింది.  బుధవారం రాత్రి గ్రామంలోని ఓ బెల్ట్ షాప్ పక్కన పాత కక్షలతో బర్లపాటి రాజేశ్వర్ అనే వ్యక్తి అతి కిరాతకంగా హత్యకు గురయ్యాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయాలు కావడంతో అతడు సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నరు. హత్యచేసిన నిందితున్ని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులని కఠినంగా శిక్షించాలని ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషను ముందు ఆందోళన చేస్తున్నారు మృతుని బంధువులు.