రెండు చేతుల్లో కల్లుగీసే కత్తులు పట్టుకుని... పట్టపగలే యువకుడిపై హత్యాయత్నం..

సిరిసిల్ల: కల్లు గీయడానికి ఉపయోగించే కత్తులతో ఓ వ్యక్తి యువకుడిపై దాడి చేసేందుకు యత్నించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన రెండు రోజుల క్రితం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్వాపూర్ గ్రామానికి చెందిన బాలసాని మల్లయ్య అనే వ్యక్తి గౌడ కులస్తులు కల్లు గీయడానికి ఉపయోగించే 2 కత్తులను తన రెండు చేతుల్లో పట్టుకుని అదే గ్రామానికి చెందిన పాలకుర్తి సాయి కుమార్ యువకుడిపై దాడికి యత్నించాడు. పాత కక్షల నేపథ్యంలోనే దాడి జరిగినట్లు సమాచారం. ఈ సంఘటనపై ఇరువురు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు... విచారణ జరుపుతామని రూరల్ సిఐ ఉపేందర్ తెలిపారు.

First Published Jan 9, 2022, 2:58 PM IST | Last Updated Jan 9, 2022, 2:58 PM IST