నేనెవరో తెలుసా.. పోలీసులపై ఓ వ్యక్తి పచ్చిబూతులు

హైదరాబాద్ లోని లంగర్‌ హౌస్‌ లో ఓ వ్యక్తి హల్‌ చల్‌ చేశాడు.  

First Published Apr 30, 2020, 2:54 PM IST | Last Updated Apr 30, 2020, 2:59 PM IST

హైదరాబాద్ లోని లంగర్‌ హౌస్‌ లో ఓ వ్యక్తి హల్‌ చల్‌ చేశాడు.  లాక్‌ డౌన్‌ సమయంలో అకారణంగా రోడ్డు మీదికి వచ్చిన వాహనదారుడిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆ వ్యక్తి పోలీసులను బూతులు తిడుతూ, దాడి చేయబోయాడు. దీంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న స్టేషన్‌ కు తరలించారు. ఎవరా అని ఆరా తీస్తే అతని పేరు లోకేష్ అని, ఇటీవలే భార్య చనిపోయిందని, కొద్ది రోజుల క్రితంఎర్రగడ్డ లోని డీఅడిక్షన్‌ సెంటర్‌ లో చికిత్స తీసుకున్నాడని తెలిసింది. పోలీసుల దర్యాప్తులో అతనికి మతి స్థిమితం సరిగా లేదని తేలింది. ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.