Asianet News TeluguAsianet News Telugu

అధికారులపై దాడి: నల్లగొండ జిల్లాలో ఎట్టకేలకు చిక్కిన చిరుత

నల్లగొండ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా వన్యప్రాణులు జనావాసాల్లోకి, రోడ్ల మీదికి వస్తున్నాయి. 

నల్లగొండ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా వన్యప్రాణులు జనావాసాల్లోకి, రోడ్ల మీదికి వస్తున్నాయి. వన్యమృగాలు కూడా పొలాల్లోకి, రోడ్ల మీదికి వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల హైదరాబాదు సమీపంలోని కాటేదాన్ ప్రాంతంలో చిరుతపులి తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా నల్లగొండ జిల్లాలో చిరుతపులి కలకలం సృష్టించింది.నల్లగొండ జిల్లాలోని మర్రిగుడా మండలం రాజపేత తండా శివారులో చిరుతపులి సంచారం కలకలం సృష్,టించింది. గ్రామశివారులోని ఓ రైతు పొలంలో చిరుత ప్రత్యక్షమైంది. పొలానికి ఏర్పాటు చేసిన కంచెలో చిరుత చిక్కుకుంది. గురువారం ఉదయం అటు వైపుగా వెళ్తున్న రైతులు చిరుత అరుపులు వినిపించాయి. దాంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో అధికారులు రంగంలోకి దిగారు. అయితే, ఓ దశలో చిరుత చిక్కినట్లే చిక్కి తప్పించుకుంది. ఎదురు దాడికి దిగింది. ఓ అధికారికి పైకి ఎగిరి దూకింది. ఈ ఘటనలో ఇద్దరు అధికారులు గాయపడ్డారు. నాలుగు నెలల క్రితం ఇదే ప్రాంతంలో ఓ చిరుత అటవీ శాఖ అధికారలకు చిక్కింది. ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకోగలిగారు. దాన్ని బోనులు పెట్టి జంతు ప్రదర్శనశాలకు తరలిస్తున్నారు..