ఎల్ఎండి 4 గేట్లు ఎత్తిన అధికారులు..30 వేల క్యూసెక్కుల నీరు విడుదల..

లోయర్ మానేర్ జలాశయం (ఎల్ ఎం డి) గేట్లను జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ఎత్తారు. మొత్తం 4 గేట్లను ఎత్తి 30 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

First Published Jul 23, 2022, 1:21 PM IST | Last Updated Jul 23, 2022, 1:21 PM IST

లోయర్ మానేర్ జలాశయం (ఎల్ ఎం డి) గేట్లను జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ఎత్తారు. మొత్తం 4 గేట్లను ఎత్తి 30 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కరీంనగర్ : ఎల్ ఎండి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగడంతో గేట్లను ఎత్తడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మానేర్ వాగు, ఎస్సారెస్పీ, మిడ్ మానేర్ నుండి ఎల్ ఎం డి కి నీటి తాకిడి పెరగడంతో గేట్లు ఎత్తడం విషయమై అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడంతో అధికారులు  గేట్లను ఎత్తివేశారు. ఎల్ ఎండిలో నిన్న సాయంత్రం వరకు 20టీఎంసీల నీరు ఉండగా, ప్రస్తుతం 21టీఎంసీ నీరు ఉంది. 30 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. నీటి ఇన్ఫ్లో ఆధారంగా గేట్ల ఎత్తడం, తగ్గించడం ఉంటుందన్నారు. గత ఏడాది ఇదే నెలలో నీటిని విడుదల చేశామని అధికారులు తెలిపారు . కార్యక్రమంలో ఎస్ఈ శివకుమార్, ఈఈ నాగభూషణం, పాల్గొన్నారు.