Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ శివారు నుండి ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కు చిరుతపులి...

మహబూబ్ నగర్ : ఇటీవల హైదరాబాద్ శివారులోని ప్రముఖ ఫార్మా కంపనీలోకి ప్రవేశించిన చిరుతపులి ఉద్యోగులను బెంబేలెత్తించిన విషయం తెలిసిందే. 

First Published Dec 23, 2022, 12:02 PM IST | Last Updated Dec 23, 2022, 12:02 PM IST

మహబూబ్ నగర్ : ఇటీవల హైదరాబాద్ శివారులోని ప్రముఖ ఫార్మా కంపనీలోకి ప్రవేశించిన చిరుతపులి ఉద్యోగులను బెంబేలెత్తించిన విషయం తెలిసిందే. ఇలా సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెటిరో ఫార్మా పరిశ్రమలో అలజడి సృష్టించిన చిరుతను పట్టుకున్న అటవీ అధికారులు తాజాగా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మన్ననూరు రేంజ్ లో విడుదల చేసారు. మూడు రోజుల పాటు హైదరాబాద్ జూపార్క్ లో వుంచి చిరుత ఆరోగ్యపరిస్థితి పరిశీలించిన అధికారులు అంతా బావుందని నిర్దారణకు వచ్చాక గురువారం రాత్రి అడవిలో వదిలిపెట్టారు.