ఫార్మా పరిశ్రమలో చిరుతపలి... ప్రాణభయంతో పరుగుతీసిన ఉద్యోగులు
సంగారెడ్డి : హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ప్రముఖ ఫార్మా కంపనీలో చిరుతపులి సంచారం కలకలం రేపింది.
సంగారెడ్డి : హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ప్రముఖ ఫార్మా కంపనీలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లాలోని హెటిరో ఫార్మా పరిశ్రమలోని ఓ బ్లాక్ లో చిరుతపులిని గమనించిన ఉద్యోగులు భయంతో బయటకు పరుగుతీసారు. వెంటనే కంపనీ ఉన్నతాధికారులు అటవీ అధికారులకు సమాచారమివ్వడంతో వారు ఎంతో చాకచక్యంగా చిరుతను బంధించారు. ఎలాంటి ప్రమాదాన్ని కలిగించకుండానే చిరుత పట్టుబడటంతో ఫార్మా కంపనీ ఉద్యోగులు, యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. చిరుత సంచారానికి సంబంధించిన దృశ్యాలు కంపనీలోని సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి.