Asianet News TeluguAsianet News Telugu

అక్రమ ఇసుకరవాణా చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవు..

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల మానేరు వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఆరు ట్రాక్టర్లను రెవెన్యూ సిబ్బంది పట్టుకున్నారు. 

First Published Jan 21, 2023, 2:10 PM IST | Last Updated Jan 21, 2023, 2:09 PM IST

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల మానేరు వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఆరు ట్రాక్టర్లను రెవెన్యూ సిబ్బంది పట్టుకున్నారు. ట్రాక్టర్లను తాసిల్దార్ కార్యాలయానికి తరలించారు. మైనింగ్ అధికారుల ద్వారా కేసు నమోదు చేసి జరిమానా విధించనున్నట్లు రెవెన్యూ సిబ్బంది తెలిపారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న విషయాన్ని ప్రజలు సమాచారం అందించడంతో ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు రెవెన్యూ సిబ్బంది తెలిపారు. కేవలం శాంటాక్స్ ద్వారా మాత్రమే ఇసుక రవాణా జరగాలని సూచించారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.