Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్ జహిరాబాద్ పర్యటనలో ఉద్రిక్తత... నిమ్జ్ నిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జ్

సంగారెడ్డి : జాతీయ పెట్టుబడులు ఉత్పాదక మండలి (నేషనల్ ఇన్వెస్టిమెంట్ ఆండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్) ప్రాజెక్ట్ లో భూములు కోల్పోయిన నిర్వాసితుల ఆందోళనతో జహీరాబాద్ ప్రాంతం అట్టుడికింది.

First Published Jun 22, 2022, 1:17 PM IST | Last Updated Jun 22, 2022, 1:17 PM IST

సంగారెడ్డి : జాతీయ పెట్టుబడులు ఉత్పాదక మండలి (నేషనల్ ఇన్వెస్టిమెంట్ ఆండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్) ప్రాజెక్ట్ లో భూములు కోల్పోయిన నిర్వాసితుల ఆందోళనతో జహీరాబాద్ ప్రాంతం అట్టుడికింది. నిమ్జ్ పరిధిలోని ఎల్గోయి, చీలపల్లి గ్రామ శివార్లలో ఏర్పాటుచేయనున్న రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ వేమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు   తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భూమిపూజ చేసారు. ఈ సందర్భంగా నిమ్జ్ ప్రాజెక్ట్ భూనిర్వాసితులు మంత్రిని అడ్డుకునేందుుకు  ప్రయత్నించారు. ఎక్కడిక్కడ రోడ్లపైకి నిమ్జ్ బాధిత గ్రామాల ప్రజలు చేరుకోవడంతో  పోలీసులు అప్రమత్తమయ్యాయి. వెంటనే ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.  పోలీస్ వలయాన్ని దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నించడంతో గంగ్వార్ వద్ద ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేసారు. దీంతో ఓ మహిళ గాయపడింది. ఇక ఎల్గోయి గ్రామానికి చెందిన నిమ్జ్ నిర్వాసిత రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు ఝరాసంగం పోలీస్ స్టేషన్ కు తరలించారు.