తెలంగాణ భవన్ లో సందడి... భారీ టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన కేటీఆర్

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో భారీ జెండా ఏర్పాటుచేసారు.

First Published Apr 27, 2022, 11:24 AM IST | Last Updated Apr 27, 2022, 11:24 AM IST

 

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో భారీ జెండా ఏర్పాటుచేసారు. 40ఫీట్ల ఎత్తులో ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ పార్టీ జెండానే వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్కరించారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం భారీ కేక్ ను మంత్రి కట్ చేసారు. 

ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా 
తెలంగాణ పాటలు, బాణసంచా చప్పుళ్ళతో తెలంగాణ భవన్ సందడిగా మారింది.