సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో గర్భిణీ మృతి: వైద్యులపై ఆగ్రహం, ఇంత దారుణమా(వీడియో)
Aug 2, 2019, 5:21 PM IST
సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో డాక్టర్ల తీరుపై మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలో సమస్యలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గురువారం ఈ ఆస్పత్రిలో వైద్యం అందక గర్భిణి చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై కేటీఆర్ స్పందించారు. వైద్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. డాక్టర్ల తీరు ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేదిగా ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన వారిని మరోచోటకి వెళ్లమని చెప్పడం దారుణమన్నారు.