Asianet News TeluguAsianet News Telugu

కార్యకర్త మృతితో చలించిపోయిన కవిత (వీడియో)

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త కిషోర్ కుమార్ శుక్రవారం గుండె పోటుతో మృతి చెందడం పట్ల కల్వకుంట్ల కవిత చలించిపోయారు. 

 

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త కిషోర్ కుమార్ శుక్రవారం గుండె పోటుతో మృతి చెందడం పట్ల కల్వకుంట్ల కవిత చలించిపోయారు. 

 సోమవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా, షకీల్ ఆమిర్, కె. విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీలు వి.జి గౌడ్, ఆకుల లలిత, మేయర్ ఆకుల సుజాత తో పాటు ఈగ గంగారెడ్డి, సిహెచ్ ప్రభాకర్ రెడ్డి,  పలువురు టిఆర్ఎస్ నేతలతో కలిసి కిషోర్ కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. తన ఓటమిని తట్టుకోలేక మనస్తాపంతో అన్నపానీయాలు, నిద్రాహారాలు మానేసిన కిషోర్ గుండె పోటు కు గురయిన విషయం తెలిసి కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటి పర్యంతం అయ్యారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ కిషోర్ మృతి తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. కిషోర్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. పార్టీ కార్యకర్తలు, తన అభిమానులు ధైర్యం కోల్పోవద్దు అని కోరారు. తనది నిజామాబాద్ అని, తాను నిజామాబాద్ ను వదిలిపోనన్నారు. నిజామాబాద్ జిల్లా , రాష్ట్ర అభివృద్ధికి తన కృషి కొనసాగుతుందన్నారు.

రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో గెలుపోటములు ఉంటాయి. ఒడిదుడుకులూ ఉంటాయి అని కవిత అన్నారు. టిఆర్ఎస్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే పార్టీ  అన్నారు.
పడవుల్లో ఉన్నా లేక పోయినా ప్రజల్లోనే ఉంటామని స్పష్టం చేశారు.

మొన్న జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ను కాదని దేశంలో అధికారంలోకి వస్తుందేమో అన్న ఆశతోనే ప్రజలు బిజెపి వైపు మొగ్గు చూపినట్లు కనిపిస్తోందని కవిత చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో బిజెపి పై అనేక ఆశలు ప్రజలు పెట్టుకున్నారు.. నిజామాబాద్ కు సంభందించిన ప్రత్యేక ఆకాంక్షలను కొత్తగా ఎన్నికైన అభ్యర్థి, వారి పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లు  కవిత చెప్పారు.

ఓటమిలోనూ హుందాగా ఉండటం తెలంగాణ ఉద్యమం నేర్పించింది అన్నారు. ఓటమీలోనూ హుందాగా ఉందాం..బంగారు తెలంగాణ నిర్మాణం లో కలిసి పనిచేద్దాం అని కవిత కార్యకర్తలను కోరారు.