గంటల వ్యవధిలో కిడ్నాపర్ల చెరనుండి చిన్నారిని కాపాడిన సూపర్ పోలీసులు...

కరీంనగర్ : స్వాతంత్ర్య దినోత్సవం రోజున తమ సత్తా ఏంటో కరీంనగర్ పోలీసులు చాటిచెప్పారు.

First Published Aug 17, 2022, 1:33 PM IST | Last Updated Aug 17, 2022, 1:33 PM IST

కరీంనగర్ : స్వాతంత్ర్య దినోత్సవం రోజున తమ సత్తా ఏంటో కరీంనగర్ పోలీసులు చాటిచెప్పారు. కిడ్నాప్ కు గురయిన ఓ చిన్నారి ఆఛూకీని సాంకేతికత సాయంతో కనుక్కుని కేవలం నాలుగు గంటల్లోనే తల్లిఒడికి చేర్చారు. దీంతో కరీంనగర్ పోలీసులపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కరీంనగర్ పట్టణంలోని అశోక్ నగర్ లో అర్ధరాత్రి పద్దెనిమిది నెలల చిన్నారి కిడ్నాప్ కు గురయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి టెక్నాలజీ సాయంతో చిన్నారి ఆఛూకీ కనుగొన్నారు. తమ బిడ్డును సురక్షితంగా కాపాడిన పోలీసులకు ఆ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.