Asianet News TeluguAsianet News Telugu

టార్గెట్.. ఫిజికల్ ఫిట్ నెస్.. కరీంనగర్ పోలీసుల కొత్త ఫైట్..

మానసికంగా, శారీరకంగా సంసిద్ధంగా ఉండటంతోపాటు రోగనిరోధకశక్తిని పెంపొందించుకునేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా పోలీసులు వివిధ రకాల వ్యాయామాలపై దృష్టి కేంద్రీకరించారు.

మానసికంగా, శారీరకంగా సంసిద్ధంగా ఉండటంతోపాటు రోగనిరోధకశక్తిని పెంపొందించుకునేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా పోలీసులు వివిధ రకాల వ్యాయామాలపై దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం నెలకుని ఉన్న పరిస్థితుల్లో గత రెండున్నర నెలల నుండి రేయింబవళ్ళు 
అలుపెరుగకుండా ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి విధులను నిర్వహించిన పోలీసులు సడలింపులతో లభించిన సమాయాన్నివృధా చేయకుండా తమకు వీలైన సమయాల్లో వివిధ రకాల వ్యాయామాలను కొనసాగిస్తున్నారు. సహనం కోల్పోకుండా ఉండటం, అంకితభావంతో పనిచేయడం వల్ల లభించే గుర్తింపులు, దేహదారుఢ్యాన్నికాపాడుకునేందుకు దోహదపడే పలుఅంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా పోలీస్ కమిషనర్ విబికమలాసన్ రెడ్డి వివరించారు.

Video Top Stories