Asianet News TeluguAsianet News Telugu

అలా బయటకు వస్తే కేసులే: కరీంనగర్ సిపి హెచ్చరిక

కరీంనగర్ జిల్లాలో లాక్ డౌన్ ని పకడ్బందీగా, కఠినంగా అమలు చేస్తున్నారు అధికారులు.

First Published May 22, 2021, 4:58 PM IST | Last Updated May 22, 2021, 4:58 PM IST

కరీంనగర్ జిల్లాలో లాక్ డౌన్ ని పకడ్బందీగా, కఠినంగా అమలు చేస్తున్నారు అధికారులు. ఇవాళ(శనివారం) కరీంనగర్ పట్టణంలో లాక్ డౌన్ అమలు అవుతున్న తీరుని జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా పరిశీలించారు. సిపి కమలాసన్ రెడ్డి, కలెక్టర్ శశాంక, మేయర్ సునీల్ రావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు కరీంనగర్ లోని పలు ప్రాంతాలలో కాలినడకన పర్యటించారు. ఈ సందర్భంగా కమీషనర్ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ... ఏ కారణం లేకుండా బయటికి వచ్చినవారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రాణాలని పణంగా పెట్టి పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని... వారికి సహకరించాలని సూచించారు. ప్రజలు లాక్ డౌన్ సడలింపుల సమయాన్ని వాడుకోవాలని సిపి సూచించారు.