ప్రాంతేతరుడి కుట్రలను తిప్పికొట్టే సమయమిదే.. కాళోజీ మాటలే స్పూర్తి: మంత్రి ప్రశాంత్ రెడ్డి
తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు నిజామాబాద్ జిల్లా వేల్పూరులో ఘనంగా నిర్వహించారు.
తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు నిజామాబాద్ జిల్లా వేల్పూరులో ఘనంగా నిర్వహించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూరు క్రాస్ రోడ్ లోని మార్కెట్ యార్డ్ వద్ద జరిగిన ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొని కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సాహితివేత్తగా కాళోజీ నారాయణరావు తెలంగాణ బాష, యాసలో రచనలను మంత్రి గుర్తచేసారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ... ''ప్రాంతేతరుడు మోసం చేస్తూ పోలిమేర దాకా తరిమికొడదాం... ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఇక్కడే పాతిపెట్టు'' అన్న కాళోజీ మాటలను తెలంగాణ ప్రజలు గుర్తుచేసుకోవాల్సిన అవసరం వుందన్నారు. ఈ మాటలతో స్పూర్తిపొంది తెలంగాణలో అలజడి సృష్టించాలని చూస్తున్న ప్రాంతేతరుడి కుట్రలను తిప్పికొట్టాలంటూ పరోక్షంగా బిజెపికి మంత్రి ప్రశాంత్ రెడ్డి చురకలు అంటించారు.