పూర్వీకులు ఏలిన గడ్డపై అడుగిడిన కాకతీయ వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్...
వరంగల్ : తెలంగాణను పాలించిన రాజవంశాల్లో కాకతీయులది ప్రత్యేకస్థానం. నేటికీ కాకతీయ కళాసంపద తెలంగాణ రాష్ట్రానికి మణిహారంలా నిలుస్తోంది.
వరంగల్ : తెలంగాణను పాలించిన రాజవంశాల్లో కాకతీయులది ప్రత్యేకస్థానం. నేటికీ కాకతీయ కళాసంపద తెలంగాణ రాష్ట్రానికి మణిహారంలా నిలుస్తోంది. అలాంటి కాకతీయుల వైభవాన్ని నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ్టి (గురువారం) నుండి వరంగల్ లో వారోత్సవాలను నిర్వహిస్తోంది. కాకతీయ వంశానికి చెందిన కమల్ చంద్ర భంజ్ దేవ్ ఈ వారోత్సవాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. హన్మకొండ హరిత హోటల్ నుండి వరంగల్ భద్రకాళి ఆర్చీకి చేరుకున్న కమల్ చంద్రకు తెలంగాణ సాంప్రదాయం ప్రకారం ఘనస్వాగతం పలికారు. అక్కడి నుండి ప్రత్యేక వాహనంలో ఆయనను భద్రకాళి ఆలయానికి తీసుకెళ్లి అమ్మవారి దర్శనం చేయించారు. కమల్ చంద్ర వెంట మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్,మేయర్ గుండు సుధారాణి వున్నారు.