Asianet News TeluguAsianet News Telugu

కొండగట్టుకు చేరుకున్న పవన్... అభిమానులు, జనసైనికులతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం

కరీంనగర్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలతో తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయప్రాంగణం కిక్కిరిసిపోయింది.  

First Published Jan 24, 2023, 3:27 PM IST | Last Updated Jan 24, 2023, 3:27 PM IST

కరీంనగర్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలతో తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయప్రాంగణం కిక్కిరిసిపోయింది.  జనసేన పార్టీ ప్రచార రథం 'వారాహి' కి మొదటిపూజ కొండగట్టులో చేయిస్తున్న పవన్ ఇవాళ ఉదయమే హైదరాబాద్ నుండి కొండగట్టుకు బయలుదేరారు. దీంతో ఆయనను చూసేందుకు అభిమానులు దారిపొడవునా భారీగా గుమిగూడారు. ఇక కొండగట్టులో అయితే భారీగా గుమిగూడిన అభిమానులు కంట్రోల్ చేయడానికి పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు. పరిస్థితిని ముందే ఊహించి జగిత్యాల డీఎస్పీ నేతృత్వంలో సుమారు  200 మందికిపైగా పోలీసులు కొండగట్టు ఆలయం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. పవన్ తో పాటు వారాహి వాహనంతో సెల్పీలు, ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడుతున్నారు.