హైదరాబాద్ మరోసారి డ్రగ్స్ కలకలం... అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
హైదరాబాద్: ఇటీవలే తెలంగాణ రాజధాని హైదరాబాద్ రాడిసన్ హోటల్లోని పబ్ పై పోలీసులు దాడిలో డ్రగ్స్ పట్టుబడటంపై కలకలం రేపిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: ఇటీవలే తెలంగాణ రాజధాని హైదరాబాద్ రాడిసన్ హోటల్లోని పబ్ పై పోలీసులు దాడిలో డ్రగ్స్ పట్టుబడటంపై కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇది మరిచిపోకముందే మరోసారి నగరంలో డ్రగ్స్ పట్టుబడింది. ఏపీలోని విశాఖపట్నం నుండి డిల్లీకి డ్రగ్స్ సరఫరా చేస్తున్న డ్రగ్స్ ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఎల్బీ నగర్ ప్రాంతంలో స్మగర్లను అరెస్ట్ చేసిన ఎస్వోటి పోలీసులు వారివద్ద నుండి 52 కిలోల గంజాయి, 1000మిల్లీ లీటర్ల హాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ స్మగ్లర్లను మీడియా ముందు ప్రవేశపెట్టిన రాచకొండ సిపి మహేష్ భగవత్ స్మగ్లింగ్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.