Asianet News TeluguAsianet News Telugu

ఇండియా-ఆస్ట్రేలియా టీ20 టికెట్లకు భారీ డిమాండ్... జింఖానా గ్రౌండ్ వద్ద ఇదీ పరిస్థితి..

హైదరాబాద్ : ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్నా క్రికెట్ ప్రియులకు హెచ్సిఏ తీరుతో నిరాశ తప్పడంలేదు.

First Published Sep 21, 2022, 2:53 PM IST | Last Updated Sep 21, 2022, 2:53 PM IST

హైదరాబాద్ : ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్నా క్రికెట్ ప్రియులకు హెచ్సిఏ తీరుతో నిరాశ తప్పడంలేదు. ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25న జరిగే ఇండియా-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసేందుకు తెలుగు ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ టికెట్లు దొరక్క తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికే పేటిఎం ద్వారా కొన్ని టికెట్లను అమ్మేసినట్లు... మిగతా టికెట్లను సికింద్రాబాదు జింఖానా మైదానంలో అమ్మకానికి పెట్టినట్లుగా ప్రచారం జరిగింది. దీంతో భారీగా అభిమానులు జింఖానా స్టేడియానికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుపై క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు నాలుగు రోజులుగా టికెట్ల కోసం జింఖానా మైదానం వద్ద పడిగాపులు కాస్తున్నామని తెలిపారు. ఇక్కడికి వస్తే ఉప్పల్ స్టేడియం వద్దే టికెట్లు ఇస్తున్నారని... అక్కడికి వెళితే కేవలం ఆన్ లైన్ లోనే విక్రయిస్తున్నట్లు చెబుతున్నారని అన్నారు. ఇలా ఒకరిపై ఓకరు సాకులు చెబుతూ టికెట్ల అమ్మకాలపై క్లారిటీ ఇవ్వడం లేదని క్రీడాప్రియులు ఆందోళన వ్యక్తం చేసారు.