స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ... రక్తదానం చేసిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా నేడు తెలంగాణ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేసారు.
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా నేడు తెలంగాణ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు అన్ని నియోజకవర్గాల్లో రక్త సేకరణ జరుగుతోందని... ఈ ఒక్కరోజే 10వేల యూనిట్ల రక్తం సేకరించనున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి హరీష్ ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ రక్తదాన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేసినట్లు మంత్రి హరీష్ తెలిపారు.