Asianet News TeluguAsianet News Telugu

ఇంటికి పంపాలంటూ వలసకూలీల ఆందోళన .....

లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు తమ స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు తమ స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సంబంధించిన ఏర్పాటు  చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని టోలిచౌకి, మెహదీపట్నం ప్రాంతాల్లో నివససిస్తున్న రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కూలీలు తమను సొంత ప్రాంతాలకు పంపాలంటూ రోడ్లపైకి వచ్చారు . 1000 మందికి పైగా టోలిచౌకి వంతెన వద్దకు చేరుకున్న వారిని  పోలీసులు అడ్డుకోవడంతో వారంతా ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌ అక్కడికి చేరుకుని జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌తో చర్చించారు. వలస కూలీల ఆకలి బాధలు తీర్చేందుకు టోలిచౌకి ప్రాంతంలో 5 అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు . అందరూ సమీపంలోని పోలీస్‌ స్టేషన్లకు వెళ్లి తమ వివరాలు నమోదు చేసుకోవాలని, ప్రభుత్వంతో మాట్లాడి ప్రయాణ ఏర్పాట్లు చేస్తామని చెప్పడంతో వారంతా ఆందోళన విరమించారు.