Asianet News TeluguAsianet News Telugu

తండ్రి గుర్తుగా గ్రామంలో కంటి హాస్పిటల్ కట్టించిన తెలుగు ఐఏఎస్

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలం బసంత్ నగర్ లో పుట్టి పెరిగిన ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి... తన తండ్రి దర్జీగా పని చేసి తనను ఈ స్థాయికి చేరుకోవడానికి కష్టపడ్డ తీరు గుర్తు చేసుకుంటూ ఎల్లకాలం ప్రజల గుండెల్లో ఉండేందుకు ఆలయ ఫౌండేషన్ ద్వారా కంటి ఆసుపత్రికి పునాది వేశాడు.  

First Published Apr 9, 2023, 4:28 PM IST | Last Updated Apr 9, 2023, 4:28 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలం బసంత్ నగర్ లో పుట్టి పెరిగిన ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి... తన తండ్రి దర్జీగా పని చేసి తనను ఈ స్థాయికి చేరుకోవడానికి కష్టపడ్డ తీరు గుర్తు చేసుకుంటూ ఎల్లకాలం ప్రజల గుండెల్లో ఉండేందుకు ఆలయ ఫౌండేషన్ ద్వారా కంటి ఆసుపత్రికి పునాది వేశాడు.  తాను ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న మధ్యప్రదేశ్  రాష్టంలో ఉన్నత స్థాయిలో ఉంటూనే స్థానికంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. నూతనంగా నిర్మించిన శంకర్ కంటి విజన్ సెంటర్ ను సోమవారం  ప్రముఖుల తో  ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 20 ఏళ్ల క్రితం తాను చదువుకున్న మిత్రులతో కలిసి మంచి చెడులు ఆలోచిస్తూ మానవతా దృక్పథంతో ఆలయ ఫౌండేషన్ స్థాపించామని పేర్కొన్నారు. అప్పటినుంచి తన ఆలోచనలకు ఆచరణలోకి తీసుకువస్తూ విద్యా, వైద్య, నిరుపేద వర్గాలకు తోచిన సహాయాన్ని అందిస్తున్నామన్నారు. తన చిన్ననాటి మిత్రులతో కలిసి ఉన్న స్వస్థలంలో ఉచిత కంటి ఆసుపత్రి ఏర్పాటు చేసి తన వంతుగా సహకారాన్ని అందించడం సంతోషంగా ఉందన్నారు.