Asianet News TeluguAsianet News Telugu

నా తుమ్ములకు కారణం అదే.. మీరనుకునేది కాదు.. కేటీఆర్ వివరణ

మంత్రి కేటీఆర్ సోమవారం సిరిసిల్ల పర్యటనలో జలుబుతో బాధ పడుతూ పదే పదే టవల్ అడ్డుపెట్టుకుని తుమ్మే వీడియో వైరల్ గా మారింది.

మంత్రి కేటీఆర్ సోమవారం సిరిసిల్ల పర్యటనలో జలుబుతో బాధ పడుతూ పదే పదే టవల్ అడ్డుపెట్టుకుని తుమ్మే వీడియో వైరల్ గా మారింది. దీంతో కరోనా నేపథ్యంలో కేటీఆర్ ఆరోగ్యం మీద సర్వత్రా అనుమానాలు వ్యక్తం అయ్యాయి.  ఈ వీడియో వైరల్ కావడంతో.. కేటీఆర్ ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తమైంది. మంత్రి ఫ్లూతో బాధపడుతున్నారా లేదా మరేదైనా సమస్యతో బాధపడుతున్నారా అని తెలియలేదు. దీంతో ఓ వ్యక్తి సోషల్ మీడియా ద్వారా ఇదే విషయాన్ని కేటీఆర్ వద్ద ప్రస్తావించగా.. తాను చాలా ఏళ్లుగా అలర్జీతో బాధపడుతున్నానని చెప్పారు. అందుకే జలుబు, తుమ్ములు వచ్చాయన్నారు. సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్‌లో రూ.11.76 కోట్లతో నూతనంగా నిర్మించిన పరిపాలనా భవనం, భోజనశాల, నాలుగు వరుసల రోడ్డు మరియు ఇతర సౌకర్యాలను కేటీఆర్ ప్రారంభించారు.

Video Top Stories