సైకిల్ పై జొమాటో డెలివరీలు... చలించి బైక్ గిఫ్ట్ గా ఇచ్చిన హైద్రాబాదీ ఫుడీలు

వర్షం కురుస్తుండగా ఛాయ్ ప్రియుడైన హైద్రాబాదీ రాబిన్ ముఖేష్ నీలోఫర్ నుంచి జొమాటోలో ఛాయ్ ఆర్డర్ చేసాడు. 

First Published Jun 19, 2021, 10:48 AM IST | Last Updated Jun 19, 2021, 10:48 AM IST

వర్షం కురుస్తుండగా ఛాయ్ ప్రియుడైన హైద్రాబాదీ రాబిన్ ముఖేష్ నీలోఫర్ నుంచి జొమాటోలో ఛాయ్ ఆర్డర్ చేసాడు. ఛాయ్ డెలివరీకి వచ్చిన అబ్బాయి తాను తడిచిపోయి ఉన్నందున అపార్ట్మెంట్ కిందిదాకా రాగలరా అని ఫోన్ లో అడగడంతో... కిందకు వచ్చిన రాబిన్ షాక్ అయ్యాడు. ఆ జోరు వానలో డెలివరీ చేయడానికి వచ్చిన ఆ డెలివరీ ఏజెంట్ సైకిల్ పై వచ్చాడు.  దాదాపుగా 9 కిలోమీటర్ల దూరాన్ని ఎలా 20 నిమిషాల్లోనే చేరుకోగలిగావు అని అడిగితే... అమాయకంగా...  త్వరగా డెలివరీ చేస్తే ఇంకో ఆర్డర్ కూడా వస్తుంది, అప్పుడు మరికొన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అనే సమాధానం ఆ డెలివరీ ఏజెంట్ నోటి నుండి రావడంతో రాబిన్ చలించిపోయాడు.