విసిరేసిన పసిబిడ్డను చేతుల్లోకి తీసుకుని... మానవత్వం చాటుకున్న కుషాయిగూడ ఎస్సై

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసిగుడ్డును అత్యంత దారుణంగా అపార్ట్ మెంట్ పైనుండి విసిరి పరారయ్యారు. 

First Published Dec 19, 2022, 5:09 PM IST | Last Updated Dec 19, 2022, 5:09 PM IST

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసిగుడ్డును అత్యంత దారుణంగా అపార్ట్ మెంట్ పైనుండి విసిరి పరారయ్యారు. ఈ అమానుషం కుషాయిగూడ పరిధిలో కమలానగర్లో చోటుచేసుకుంది. పసిబిడ్డ ఏడుపువిని అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు సమాచరమివ్వగా అక్కడికి చేరుకున్న కుషాయిగూడ ఎస్సై సాయికుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు. పసిబిడ్డను చేతుల్లోకి తీసుకున్న ఎస్సై తలకు గాయం చూసి తల్లడిల్లిపోయాడు. వెంటనే బిడ్డను  దగ్గర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించిన ఎస్సై అక్కడ ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నీలోఫర్ కు తరలించారు. పసిబిడ్డ ప్రాణాలను కాపాడేందుకు ఎస్సై పడిన తాపత్రయం చూసి పోలీసంటే ఇలాగే వుండాలని అనుకుంటామని... అలాంటి మనసున్న ఎస్సై ఇక్కడ పనిచేయడం గర్వంగా వుందని కుషాయిగూడ వాసులు అంటున్నారు.