Asianet News TeluguAsianet News Telugu

దళితబంధు రాకుంటే సామూహిక ఆత్మహత్యలే... పురుగుల మందు డబ్బాలతో హుజురాబాద్ ప్రజల ఆందోళన

కరీంనగర్ : కేసీఆర్ సర్కార్ హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో ప్రకటించిన దళిత బంధు తమకే అందడంలేదంటూ హుజురాబాద్ కు చెందిన దళితులు ఆందోళనకు దిగారు.  

First Published Sep 13, 2022, 10:20 AM IST | Last Updated Sep 13, 2022, 10:20 AM IST

కరీంనగర్ : కేసీఆర్ సర్కార్ హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో ప్రకటించిన దళిత బంధు తమకే అందడంలేదంటూ హుజురాబాద్ కు చెందిన దళితులు ఆందోళనకు దిగారు.  తమ ఓట్ల కోసమే దళిత బంధు ప్రకటించారని... ఇప్పుడేమో అన్ని అర్హతలున్నా డబ్బులు ఇవ్వడంలేదని వాపోతున్నారు. తమకు దళితబంధు ఇవ్వకుంటే సామూహిక ఆత్మహత్యలకు పాల్పడతామంటూ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి పురుగుల మందు డబ్బాలతో వచ్చారు కొందరు జమ్మికుంట వాసులు. కరీంనగర్ కలెక్టరేట్ లో ప్రజావాణి నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్ ముందు దళిత బంధు కోసం ఆందోళనకు దిగారు.  పురుగుల మందు డబ్బాలతో పురుషులు, కన్నీరు పెట్టుకుంటూ మహిళలు అదనపు కలెక్టర్ కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రజావాణిలో ఆందోళనకు దిగినవారికి పోలీసులు నచ్చజెప్పి బయటకు పంపించారు.