Asianet News TeluguAsianet News Telugu

Huzurabad Bypoll:వెన్నుపోటుదారుల వెన్నులో వణుకు పుట్టేలా... గెల్లు విజయం: వినోద్ కుమార్

కరీంనగర్:  హుజురాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మొదటి రోజే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు.

కరీంనగర్:  హుజురాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మొదటి రోజే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇల్లందకుంట రామాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం.. ఆయన హుజురాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు.  

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రణాళిక బోర్డ్ వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్ మాట్లాడుతూ... ఆత్మగౌరవం పేరుతో ఈటెల ఆత్మవంచన చేసుకుంటున్నారన్నారు. హుజురాబాద్ ప్రజలకు ఆత్మగౌరవ సమస్యలేదన్నారు. హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంటా, కమలాపూర్  రైతులు, ప్రజలకు అప్పుల తిప్పలు లేకుండా రైతుబందు, రైతుబీమా, 24గంటల ఉచితకరెంటు ద్వారా కోట్లాది రూపాయల్ని అందించి హుజురాబాద్ తో పాటు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం కేసీఆర్ నిలబెట్టారన్నారు. వెన్నుపోటుదారుల వెన్నులో వణుకుపుట్టేవిదంగా టీఆర్ఎస్ అభ్యర్తిగా పోటీచేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రజలు గెలిపించబోతున్నారన్నారు వినోద్.