భార్యను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం... వీడిన పెద్దపల్లి హత్య మిస్టరీ
పెద్దపల్లి : ఇటీవల పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకున్న వివాహిత అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు.
పెద్దపల్లి : ఇటీవల పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకున్న వివాహిత అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. వివాహితను అదనపు కట్నం కోసం వేధిస్తూ చివరకు దారుణంగా చంపాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో కిరాతక భర్తను కటకటాల్లో వేసారు పోలీసులు.
వివరాల్లోకి వెళితే... పెద్దపల్లికి చెందిన కావ్య-సందీప్ భార్యాభర్తలు. పెళ్ళయిన నాటినుండి భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తున్న సందీప్ వేధించేవాడు. చివరకు గత సోమవారం తెల్లవారుజామున కావ్య నిద్రిస్తున్న సమయంలో చున్నీతో ఉరేసి చంపిన భర్త ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్న చేసాడు. అయితే అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో సందీప్ అరెస్ట్ చేసారు.