Asianet News TeluguAsianet News Telugu

జగిత్యాలలో ఘోరం... కట్టుకున్న భార్యను నరికిచంపిన కసాయి భర్త

జగిత్యాల : మూడేళ్ల కింద కన్న కొడుకును చంపిన కిరాతకుడు తాజాగా కట్టుకున్న భార్యను కూడా అతి దారుణంగా నరికిచంపాడు. 

First Published Dec 19, 2022, 2:54 PM IST | Last Updated Dec 19, 2022, 2:54 PM IST

జగిత్యాల : మూడేళ్ల కింద కన్న కొడుకును చంపిన కిరాతకుడు తాజాగా కట్టుకున్న భార్యను కూడా అతి దారుణంగా నరికిచంపాడు. ఈ ఘోరం జగిత్యాల జిల్లాలో పెగడపల్లిలో చోటుచేసుకుంది. దోమలకుంట గ్రామానికి చెందిన నక్క గంగవ్వ-రమేష్ భార్యాభర్తలు. సైకోలా వ్యవహరించే రమేష్ మూడేళ్ళక్రితం కన్న ప్రేమను మరిచి కొడుకును అతి దారుణంగా చంపాడు. తాజాగా అతడు భార్య గంగవ్వను కూడా పొట్టనబెట్టుకున్నాడు. ఆదివారం తోటి కూలీలతో కలిసి పొలంలో వరినాట్లు వేస్తుండగా రమేష్ ఆమెపై కత్తితో దాడికి దిగాడు. విచక్షణారహితంగా నరకడంతో గంగవ్వ అక్కడిక్కడే బురదలో కుప్పకూలి మృతిచెందింది. ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.