మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. ఇంటిముందుకే తాజా పండ్లు..

వాక్‌ ఫర్ వాటర్‌, తెలంగాణ మార్కెటింగ్‌శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటికే పండ్ల కార్యక్రమానికి జనాదరణ పెరుగుతోంది. 

First Published Apr 30, 2020, 5:36 PM IST | Last Updated Apr 30, 2020, 5:36 PM IST

వాక్‌ ఫర్ వాటర్‌, తెలంగాణ మార్కెటింగ్‌శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటికే పండ్ల కార్యక్రమానికి జనాదరణ పెరుగుతోంది. మిస్‌డ్‌ కాల్‌ నంబర్‌ 88753 51555కి ఫోనుకాల్స్‌, ఆన్‌లైన్‌లో ఆర్డర్లు పోటెత్తుతున్నాయి. నాణ్యత బాగుండడం, తక్కువ ధరకావడంవల్ల పండ్లు కావాలంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. సంబంధిత వెబ్‌సైట్‌కి ఇప్పటికి 26   లక్షల హిట్స్‌ రాగా... ఇప్పటి వరకు వచ్చిన లక్షన్నర ఆర్డర్లలో... 65 వేలు సరఫరా చేశారు.  డెలివరీ వేగవంతం చేసేందుకు తపాలశాఖతో ఒప్పందం కుదుర్చుకున్నారు. లాక్‌డౌన్‌ వేళ దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రజల ఇళ్ల వద్దకే తాజా పండ్లు సరఫరా చేస్తున్నందున... ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డిని నగరవాసులు ప్రశంసిస్తున్నారు.