పవర్ లో వున్నపుడే ఏం చేయలేదు.. ఇప్పుడేం చేస్తారు.: జానారెడ్డిపై మహమూద్ అలీ వ్యాఖ్యలు
Apr 7, 2021, 5:38 PM IST
నాగార్జునసాగర్: ఎన్నో ఏళ్ళు మంత్రిగా పనిచేసి కూడా జానారెడ్డి సొంత నియోజకవర్గం నాగార్జునసాగర్ ను అభివృద్ది చేయలేదని హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. పవర్ లో ఉన్నప్పుడే అభివృద్ది చేయని వ్యక్తి ఇప్పుడు గెలిచినా ఏం చేస్తారు అన్నారు. రాష్ట్రంలోనే సాగర్ నియోజకవర్గ అభివృద్ధి వరస్ట్ గా ఉందన్నారు. కాబట్టి నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని హోంమంత్రి కోరారు.